తాలిబన్ ఆక్రమిత అఫ్గాన్ నుంచి అమెరికన్లను, మిత్రదేశాల ప్రజలను తరలిస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అభయమిచ్చారు. వాయుమార్గంలో భారీగా ప్రజలను తరలించడంపై సంక్లిష్టమై అయినప్పటికీ, ఈ బాధ్యతలను నిర్వర్తిస్తామని చెప్పారు. ప్రాణనష్టం లేకుండా ఇది సాధ్యం కాకపోవచ్చని అన్నారు. అఫ్గానిస్థాన్ నుంచి ఈ నెల 31లో తన బలగాలను ఉపసంహరించుకోవాలని అమెరికా నిర్దేశించుకుంది. జులై నుంచి ఇప్పటి వరకూ 18వేల మందిని తలరించింది. తాలిబన్లు కాబూల్‌ను ఆక్రమించినా, అక్కడి అంతర్జాతీయ విమానాశ్రయం మాత్రం ఇప్పటికీ అమెరికా బలగాల స్వాధీనంలోనే ఉంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో అమెరికా, మిత్రదేశాలవారూ విదేశీ బలగాలతో కలిసి పనిచేసిన అఫ్గాన్లు భారీగా విమానాశ్రయానికి చేరుకుంటున్నారు. అయితే ధ్రువపత్రాల పరిశీలన జాప్యం కావడంతో తరలింపు ప్రక్రియ జాప్యమవుతోంది.