
స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ పోటీ విజేత, తెలంగాణకు చెందిన బృహత్ సోమతో పాటు ఎనిమిది మంది ఫైనలిస్టులు అమెరికా అధ్యక్ష భవనమైన వైట్ హౌస్‌ను సందర్శించారు. సూపర్ బౌల్ చాంపియన్‌షిప్ సీజన్‌లో కాన్సాస్ సిటీ చీఫ్స్ విజయం సాధించిన నేపథ్యంలో శ్వేతసౌధంలోని సౌత్ లాన్‌లో అభినందన కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీంట్లో పాల్గొనేందుకు స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ పోటీ ఫైనలిస్టులను ఆహ్వానించారు. వీరంతా బైడెన్‌ను కలవలేక పోయినా సూపర్ బౌల్ చాంపియన్‌షిప్ విజేతలను చూశారు. ఈ పోటీలోని మొత్తం తొమ్మిది మంది ఫైనలిస్టుల్లో భారత సంతతికి చెందినవారు అత్యధికంగా అయిదుగురు ఉన్నారు. పిల్లలందరూ తమ తల్లిదండ్రులతో కలిసి వైట్ హౌస్‌లో ఫొటోలు తీసుకున్నారు.
