Namaste NRI

నాకు ఏమైనా జరిగితే వారే బాధ్యులు: ఇమ్రాన్‌ ఖాన్‌

తన ఈ పరిస్థితికి సైన్యం, ఐఎస్‌ఐ కారణమని, తన ప్రాణానికి ముప్పు ఉందని జైలు జీవితాన్ని గడుపుతున్న పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పునరుద్ఘాటించారు. ఏడాది కాలంగా అడియాలా జైలులో గడుపుతున్నా రు 71 ఏళ్ల ఇమ్రాన్ ఖాన్.  విమర్శలను సహించలేకపోతున్న ప్రస్తుత పాక్ పాలకులు దేశ్యాప్తంగా క్షీణిస్తున్న శాంతి భద్రతలకు, వరుస ఓటములను చవిచూస్తున్న పాకిస్తాన్ క్రికెట్ జట్టు నాశనానికి బాధ్యత వహించాలని డిమాండు చేశారు. తన ఖైదుకు సంబంధించిన అన్ని పాలనాపరమైన వ్యవహారాలను ఎఎస్‌ఐ గుప్పిట్లో పెట్టుకుందని, తనకేమైనా జరిగితే అందుకు సైన్యాధిపతి, ఐఎఎస్‌ఐ డిజి బాధ్యులని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు.

Social Share Spread Message

Latest News