ఆసియా నుంచి వచ్చే కొందరు విదేశీయులపై బ్రెజిల్ ఆంక్షలు విధించడం ప్రారంభించనుంది. అమెరికా, కెనడాలకు వలస వెళ్లేందుకు తమ దేశాన్ని లాంచింగ్ పాయింట్‌గా వాడుకుంటూ ఉండటం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ దేశ న్యాయ శాఖ వెల్లడించింది. విమానాశ్రయంలో ఆశ్రయం కోసం 70 శాతానికి పైగా అభ్యర్థ నలు భారత్, నేపాల్ లేదా వియత్నాం జాతీయుల నుంచి వస్తున్నాయని తెలిపింది. ఈ నెల 26నుంచి ప్రారం భం కానున్న ఆంక్షల్లో భాగంగా ఇకపై ఆసియా దేశాల నుంచి వచ్చేవారు బ్రెజిల్‌లో వలసదారులుగా ఉండా లంటే వీసా ఉండాలి. అయితే ఇప్పటికే వీసా నుంచి మినహాయింపు పొందిన ఆసియన్లకు ఈ నిబంధన వర్తించదు.