Namaste NRI

ఈ సినిమా నాకు ఓ అరుదైన అవకాశం : రక్షిత్‌ అట్లూరి   

రక్షిత్‌ అట్లూరి హీరోగా ఆయన తండ్రి వెంకటసత్య దర్శకత్వంలో రూపొందిన న్యూఏజ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ఆపరేషన్‌ రావణ్‌. ధ్యాన్‌ అట్లూరి నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది. ఈ సందర్భంగా రక్షిత్‌ మీడియాతో మాట్లాడారు. పలాస తర్వాత మా సుధాస్‌ సినిమా సంస్థలో ఏదైనా యూత్‌కి నచ్చే సినిమా చేస్తే బావుంటుందని అనుకున్నాం. ఓవైపు నరకాసుర, శశివదనే సినిమాలు చేస్తూ నేను బిజీగా ఉండగానే కథ ఓకే అయ్యింది. దాంతో సెట్స్‌కి వెళ్లేందుకు కావాల్సినంత టైమ్‌ దొరికింది. ఆ రెండు సినిమా లు కంప్లీట్‌ చేసి వచ్చేసరికి ఆపరేషన్‌ రావణ్‌ స్క్రిప్ట్‌ రెడీ అయ్యింది. పర్‌ఫెక్ట్‌ స్క్రిప్ట్‌తో సెట్స్‌మీదకు వెళ్లాం అని చెప్పారు.  

మా నాన్న డైరెక్షన్‌ని అందరూ నమ్మారు. రాధిక శరత్‌కుమార్‌, చరణ్‌రాజ్‌ లాంటి వాళ్లు కూడా ఎంతో సహకరించారు. తొలి సినిమానే అనుభవం ఉన్న దర్శకుడిగా నాన్న ఈ సినిమాను మలిచారు. తండ్రి దర్శకత్వంలో నటించడం అదృష్టంగా భావిస్తున్నా అని రక్షిత్‌ ఆనందం వెలిబుచ్చారు. ఈ సినిమా ఫస్ట్‌హాఫ్‌ చూసి, కథలో సైకో ఎవరో గుర్తించి, తామిచ్చిన వాట్సాప్‌ నంబర్‌కి పంపిస్తే, వారికి సిల్వర్‌ కాయిన్‌ బహుమతిగా ఇస్తామని, ఆలోచనల అంతర్యుద్ధమే ప్రధాన ఇతివృత్తంగా ఈ సినిమా రూపొందిందని  తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events