అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి జంటగా నటిస్తున్న సినిమా లవ్ రెడ్డి. గీతాన్స్ ప్రొడక్షన్స్, సెహెరి స్టూడియో, ఎమ్జీఆర్ ఫిలింస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. హేమలత రెడ్డి, మదన్‌గోపాల్ రెడ్డి, ప్రభంజనం రెడ్డి, నాగరాజు బీరప్ప నిర్మాతలు. స్మరన్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర గ్లింప్స్‌ను దర్శకుడు ప్రశాంత్ వర్మ విడుదల చేశారు.దర్శకుడు స్మరన్ మాట్లాడుతూ ఆంధ్ర, కర్నాటక సరిహద్దు ప్రాంతంలో జరిగే ఒక స్వచ్ఛమైన ప్రేమ కథ ఇది. అన్ని వర్గాల ప్రేక్షకులు ఇష్టపడేలా ఉంటుంది అన్నారు. అనంతరం ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ ఈ చిత్ర గ్లింప్స్ ఆకట్టుకునేలా ఉంది. ఇది చూస్తుంటే నేనూ ఓ ప్రేమ కథను తెరకెక్కించాలని అనిపిస్తున్నది’ అన్నారు. ఈ చిత్రానికి ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వరరావు, సంగీతం : ప్రిన్స్ హెన్రీ.
