Skip to main content

Namaste NRI

ఆంధ్ర, కర్నాటక సరిహద్దులో జరిగే ఒక స్వచ్ఛమైన ప్రేమ కథ ఇది

అంజన్‌ రామచంద్ర, శ్రావణి రెడ్డి జంటగా నటిస్తున్న సినిమా లవ్‌ రెడ్డి.  గీతాన్స్‌ ప్రొడక్షన్స్‌, సెహెరి స్టూడియో, ఎమ్జీఆర్‌ ఫిలింస్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. హేమలత రెడ్డి, మదన్‌గోపాల్‌ రెడ్డి, ప్రభంజనం రెడ్డి, నాగరాజు బీరప్ప నిర్మాతలు. స్మరన్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర గ్లింప్స్‌ను దర్శకుడు ప్రశాంత్‌ వర్మ విడుదల చేశారు.దర్శకుడు స్మరన్‌ మాట్లాడుతూ ఆంధ్ర, కర్నాటక సరిహద్దు ప్రాంతంలో జరిగే ఒక స్వచ్ఛమైన ప్రేమ కథ ఇది. అన్ని వర్గాల ప్రేక్షకులు ఇష్టపడేలా ఉంటుంది అన్నారు. అనంతరం ప్రశాంత్‌ వర్మ మాట్లాడుతూ ఈ చిత్ర గ్లింప్స్‌ ఆకట్టుకునేలా ఉంది. ఇది చూస్తుంటే నేనూ ఓ ప్రేమ కథను తెరకెక్కించాలని అనిపిస్తున్నది’ అన్నారు.  ఈ చిత్రానికి ఎడిటర్‌ : కోటగిరి వెంకటేశ్వరరావు, సంగీతం : ప్రిన్స్‌ హెన్రీ.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events