అప్సరరాణి ప్రధానపాత్రలో రూపొందిన చిత్రం తలకోన. నగేశ్ నారదాసి దర్శకుడు. దేవర శ్రీధర్‌రెడ్డి నిర్మాత. ఈ సందర్భంగా చిత్రబృందం ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ని హైదరాబాద్‌లో నిర్వహించారు. తుమ్మలపల్లి రామసత్యనారాయణ, సాయివెంకట్, డీఎస్‌రావు, నటుడు రమాకాంత్, పార్థురెడ్డి తదితరులు అతిథులుగా విచ్చేసి చిత్రయూనిట్‌కి శుభాకాంక్షలు అందించారు. అప్సరరాణి కెరీర్‌లో ఇదొక ప్రత్యేకమైన సినిమా అని, ఫారెస్ట్ నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో యువతరానికి నచ్చే అంశాలన్నీ ఉంటాయని నిర్మాత తెలిపారు. చూడటానికి అప్సరరాణి కశ్మీర్ యాపిల్‌లా కనిపిస్తుందనికానీ, ఈ సినిమాలో కశ్మీర్ మిర్చిలా నటించిందని దర్శకుడు చెప్పారు. తన కెరీర్‌లో ఈ సినిమా ఓ మైలురాయిలా నిలుస్తుందని అప్సరరాణి నమ్మకం వెలిబుచ్చింది. నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. ఈ చిత్రానికి కెమెరా: ప్రసాద్, సంగీతం: సుభాష్ ఆనంద్.