Namaste NRI

ఇది ప్రతి ఒక్కరికీ కనెక్ట్‌ అయ్యే కథ : సిద్ధార్థ్‌

సిద్ధార్థ్‌ కథానాయకుడిగా రూపొందిన చిత్రం 3 బిహెచ్ కె. శ్రీగణేశ్‌ దర్శకుడు. శరత్‌కుమార్‌, దేవయాని, మీతా రఘునాథ్‌, చైత్ర, యోగిబాబు కీలక పాత్రధారులు. ఇటీవలే సినిమా విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన థ్యాంక్స్‌ మీట్‌లో సిద్ధార్థ్‌  మాట్లాడుతూ 3 బిహెచ్ కె  సినిమాలో భాగం అవ్వడం గర్వంగా ఉంది. ఒక క్లాసిక్‌ సినిమాకు ఉండాల్సిన క్వాలిటీస్‌ ఈ సినిమాలో ఉన్నాయి. ఇది ప్రతి ఒక్కరికీ కనెక్ట్‌ అయ్యే కథ. చూసిన వారంతా బావుందని మెచ్చుకుంటుంటే ఆనందం ఉంది. ఈ సినిమా చూసిన ప్రతి కొడుకు తెరపై తన తండ్రిని చూసుకుంటున్నాడు. ప్రతి తండ్రీ తన కొడుకును చూసుకుంటున్నాడు. ఇందులో నేను పోషించిన ప్రభు పాత్ర చాలా విషయాలు నేర్పింది. ఓటమి అనేది పర్మినెంట్‌ కాదని ఈ సినిమా ద్వారా దర్శకుడు శ్రీగణేష్‌ చెప్పాడు. అతని రైటింగ్‌ అద్భుతం. తెలుగు రాష్ర్టాల్లో ఫ్యామిలీ ఆడియన్స్‌ నుంచి స్పందన అద్భుతంగా ఉంది. శరత్‌కుమార్‌, దేవయాని లేకపోతే ఈ సినిమా లేదు. ప్రతి ఇంట్లో ఉండే తల్లిదండ్రుల్ని వారు కళ్లకు కట్టారు. ఈ సినిమాను విడుదల చేసిన మైత్రీ మూవీమేకర్స్‌కు థ్యాంక్స్‌ చెబుతున్నా అని అన్నారు.

Social Share Spread Message

Latest News