సీనియర్ దర్శకుడు పి.వాసు తనయుడు శక్తి వాసుదేవన్ హీరోగా రూపొందుతున్న చిత్రం అలా ఇలా ఎలా. రాజ్ శంకర్, పూర్ణ, నాగబాబు, నిషాకొఠారి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. రాఘవ దర్శకుడు. కొల్లకుంట నాగరాజు నిర్మాత. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ప్రేక్షకులు థ్రిల్ల్‌గా ఫీలయ్యే ఓ వైవిధ్యమైన కథతో తెరకెక్కించిన చిత్రమిది. తప్పకుండా అందరికి మంచి పేరును తెస్తుందని ఆశిస్తున్నాను అన్నారు. దర్శకుడు మాటాడుతూ ఈతరం ప్రేక్షకులకు నచ్చే కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో స్క్రీన్‌ప్లే హైలైట్‌గా వుంటుంది. ప్రతి సన్నివేశం ఎంతో ఉత్కంఠభరితంగా వుంటుంది అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ. ఈ నెల 21న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.