Skip to main content

Namaste NRI

ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అలా ఇలా ఎలా 

సీనియర్‌ దర్శకుడు పి.వాసు తనయుడు శక్తి వాసుదేవన్‌ హీరోగా రూపొందుతున్న చిత్రం అలా ఇలా ఎలా. రాజ్‌ శంకర్‌, పూర్ణ, నాగబాబు, నిషాకొఠారి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. రాఘవ దర్శకుడు. కొల్లకుంట నాగరాజు నిర్మాత. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ప్రేక్షకులు థ్రిల్ల్‌గా ఫీలయ్యే ఓ వైవిధ్యమైన కథతో తెరకెక్కించిన చిత్రమిది. తప్పకుండా అందరికి మంచి పేరును తెస్తుందని ఆశిస్తున్నాను  అన్నారు. దర్శకుడు మాటాడుతూ ఈతరం ప్రేక్షకులకు నచ్చే కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో స్క్రీన్‌ప్లే హైలైట్‌గా వుంటుంది. ప్రతి సన్నివేశం ఎంతో ఉత్కంఠభరితంగా వుంటుంది  అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ. ఈ నెల 21న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Social Share Spread Message

Latest News