Namaste NRI

ఇది సరైనది కాదు..ప్రతి ఒక్కరు ఖండించాల్సిందే :  బైడెన్‌

రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి, అమెరికా మాజీ ప్రెసిడెంట్‌ డొనాల్డ్‌ ట్రంప్‌పై దాడిని ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్‌ తీవ్రంగా ఖండిచారు. అమెరికాలో రాజకీయ హింసకు చోటు లేదని చెప్పారు. ఘటనపై భద్రతా ఏజెన్సీల నుంచి వివారాలు తెలుసుకున్న ఆయన ఇది సరైనది కాదన్నారు. ప్రతి ఒక్కరు దీనిని ఖండించాలని చెప్పారు. త్వరలో ట్రంప్‌తో మాట్లాడతానని వెల్లడించారు. ఆయన సురక్షితంగా ఉన్నారని తెలిసి తన మనసు కుదుటపడిందన్నారు. ఆయనతోపాటు ఆయన కుటుంబ సభ్యులు, ర్యాలీలో ఉన్నవారంతా క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నాని చెప్పారు. ఇలాంటి ఘటనలను ఖండించడంలో యావత్‌ దేశం ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉన్నదని బైడెన్‌ అన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events