రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉత్తర కొరియాలో పర్యటించబోతున్నారు. ఇరు దేశాలు ఈ మేరకు ప్రకటన లను జారీ చేశాయి. పుతిన్ ఈ దేశంలో పర్యటిస్తుండటం 24 ఏళ్లలో ఇదే తొలిసారి. అమెరికాను ఈ రెండు దేశాలు వేర్వేరుగా ఎదుర్కొంటున్న తరుణంలో పుతిన్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ భేటీ కాబోతున్నారు. సైనిక సహకారాన్ని మరింత విస్తరించుకోవడంపై వీరు చర్చలు జరిపే అవకాశం ఉంది. రష్యా నుంచి ఆర్థిక సహకారం, సాంకేతిక పరిజ్ఞానాలను తీసుకుని, ఆ దేశానికి అవసరమైన ఆయుధాలు, క్షిపణులను ఉత్తర కొరియా ఇస్తున్నదని అమెరికా, దక్షిణ కొరియా ఆరోపిస్తున్నాయి.