అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల నేపథ్యంలో అమెరికా ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఐసీఈ) వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నది. మునుపెన్నడూ లేనంతగా ఐసీఈ ఒక్కరోజులో 2,200 మంది వలసదారులను అరెస్టు చేసింది. అమెరికా చరిత్రలో ఇదే అత్యధికం.రోజుకు కనీసం 3వేల మంది వలసదారులను అరెస్టు చేయాలని ట్రంప్ సర్కార్ టార్గెట్ విధించిన వెంటనే ఈ పరిణామం చోటుచేసుకోవటం గమనార్హం.

గత వారం (జూన్ 3) ఐసీఈ 2,200 మంది వలసదార్లను అరెస్టు చేసినట్టు పేర్కొన్నది. ఒక్కరోజులోచేసినారు. అరెస్టయిన వలసదారులు ఐసీఈ ఏటీడీ (ఆల్టర్నేటివ్ టు డిటెన్షన్) అనే ప్రోగ్రాం కింద నమోదవుతారు. సరైన పత్రాలు లేని, ప్రజా భద్రతకు ముప్పు కలిగించని అక్రమ వలసదారులుగా ఐసీఈ పేర్కొంటుంది.
