Namaste NRI

కొలువుదీరిన మోదీ సర్కార్‌.. కొత్త మంత్రివర్గం ఇదే

భారత ప్రజాస్వామిక చరిత్రలో నూతన అధ్యాయం మొదలైంది. ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ వరుసగా మూడోసారి పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. తద్వారా మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ సరసన చేశారు. ఆదివారంనాడు రాత్రి దేశ విదేశాల నుంచి తరలివచ్చిన 8వేల మంది అతిథుల సమక్షంలో,  కోట్లాది మంది భారతీయుల పరోక్షంలో రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో అట్టహాసంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మోడీ చేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు.

ప్రధానమంత్రిని మినహాయిస్తే 71మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో హస్తినలో ఎన్‌డిఎ ప్రభుత్వం కొలువుదీరినట్లయింది. వీరిలో 30మంది కేబినెట్ హోదా, ఐదుగురు స్వత్రంత, 36మంది సహాయ మంత్రులు. 9మంది కొత్తముఖాలకు చోటిచ్చారు. మంత్రివర్గ కూర్పులో మోడీ అన్ని వర్గాలకు, ప్రాంతాలకు ప్రాతినిధ్యం కల్పించారు. 27మంది ఓబీసీలు, షెడ్యూల్ కులాల నుంచి 10 మంది, షెడ్యూల్ తెగల నుంచి 5, మైనారిటీల నుంచి 5గురికి చోటు కల్పించారు. ఎన్‌డిఎలోని కీలక భాగస్వామ్య పక్షాలైన టిడిపి, జెడియు సహా ఇతరులకు 11 మంత్రి పదవులు దక్కాయి. గత రెండు టర్మ్‌ల్లో మోడీ కేబినెట్‌లో ఉన్న అమిత్ షా, రాజ్‌నాథ్, నిర్మలా సీతారామన్, జై శంకర్, నితిన్ గడ్కరీ తదితరులకు తిరిగి చోటు దక్కింది. ఎన్నికల పోరులో కీలక పాత్ర పోషించిన వ్యక్తుల్లో ఒకరైన బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాను కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకు న్నారు. ఇక కేబినెట్‌లో అత్యంత పిన్న వయస్కుడిగా కింజారపు రాంమోహన్ నాయుడు రికార్డులకెక్కారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events