కెనడా గగనతలంపై చక్కర్లు కొడుతున్న అనుమానాస్పద వస్తువును అమెరికా ఫైటర్ జెట్ కూల్చివేసింది. కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో ఆదేశాల మేరకు అమెరికా, కెనెడియన్ వాయుసేనలు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించాయి. ఈ క్రమంలో యూకాన్ వద్ద అమెరికన్ యుద్ధవిమానం ఎఫ్-22 దానిని పేల్చివేసింది. అనుమానాస్పద వస్తువు శిథిలాలు యూకాన్లో పడ్డాయని, వాటిని పరిశీలించనున్నామని ట్రుడో వెల్లడించారు. వరుసగా రెండు రోజుల్లో ఇది రెండో ఘటన కావడం విశేషం. అమెరికాలోని అలస్కా వద్ద 40 వేల ఫీట్ల ఎత్తులో చక్కర్లు కొడుతున్న ఓ గుర్తు తెలియని వస్తువును ఆ దేశ యుద్ధ విమానాలు పేల్చేసిన విషయం తెలిసిందే. వారం రోజుల క్రితమే చైనాకు చెందిన నిఘా బెలూన్ను కూడా అమెరికా విమానాలు కూల్చేశాయి.














