Skip to main content

Namaste NRI

రెండు రోజుల్లో ఇది రెండో ఘటన.. అమెరికా  

కెనడా గగనతలంపై చక్కర్లు కొడుతున్న అనుమానాస్పద వస్తువును అమెరికా ఫైటర్ జెట్ కూల్చివేసింది. కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో ఆదేశాల మేరకు అమెరికా, కెనెడియన్ వాయుసేనలు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించాయి. ఈ క్రమంలో యూకాన్ వద్ద అమెరికన్ యుద్ధవిమానం ఎఫ్-22 దానిని పేల్చివేసింది. అనుమానాస్పద వస్తువు శిథిలాలు యూకాన్‌లో  పడ్డాయని, వాటిని పరిశీలించనున్నామని ట్రుడో వెల్లడించారు. వరుసగా రెండు రోజుల్లో ఇది రెండో ఘటన కావడం విశేషం.  అమెరికాలోని అలస్కా వద్ద 40 వేల ఫీట్ల ఎత్తులో చక్కర్లు కొడుతున్న ఓ గుర్తు తెలియని వస్తువును ఆ దేశ యుద్ధ విమానాలు పేల్చేసిన విషయం తెలిసిందే. వారం రోజుల క్రితమే చైనాకు చెందిన నిఘా బెలూన్‌ను  కూడా అమెరికా విమానాలు కూల్చేశాయి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events