
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కలల బిల్లు చట్టంగా మారింది. పన్నుల్లో కోతలు, వ్యయ నియంత్రణల కోసం తీసుకొచ్చిన వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లుపై రిపబ్లికన్ పార్టీ సభ్యులు, అధికారులు హర్షాతిరేకాల మధ్య ట్రంప్ సంతకం చేశారు. దీంతో ఇది చట్ట రూపం దాల్చింది. ఈ సందర్భంగా ప్రజలెప్పుడూ ఇంత సంతోషంగా ఉన్నట్లు గతంలో తానెప్పుడూ చూడలేదని ట్రంప్ అన్నారు. ఈ చట్టంతో అందరికీ లబ్ధి జరుగుతుందన్నారు. సాయుధ బలగాల నుంచి మొదలు రోజూవారీ కార్మికుల వరకు కొత్త చట్టం మద్దతుగా ఉంటుందన్నారు. అమెరికా చరిత్రలోనే తమ ప్రభుత్వం అతిపెద్ద పన్నుకోత, వ్యయకోత, సరిహద్దు భద్రతలో అతిపెద్ద పెట్టుబడి సాధించిందని పేర్కొన్నారు.















