ప్రదీప్ మాచిరాజు కథానాయకుడిగా నటించిన లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. దీపిక పిల్లి కథానాయిక. డుయో నితిన్, భరత్ కలిసి దర్శకత్వం వహించారు. మాంక్స్ అండ్ మంకీస్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కింది. నేడు విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రదీప్ ఇటీవల విలేకరులతో ముచ్చటించారు.

ఫ్యామిలీ అంతా కూర్చొని హాయిగా ఎంజాయ్‌చేసేలా ఈ సినిమా ఉంటుందని, ఇదో అందమైన చందమామ కథ అని ఆయన చెప్పారు. కథ గురించి మాట్లాడుతూ అనగనగా ఓ ఊరు. అక్కడ ఓ అమ్మాయి. అనుకోని అతిథిగా ఆ ఊర్లోకి అడుగుపెట్టిన ఓ సివిల్ ఇంజనీర్, ఆ ఊరి కట్టుబాట్ల మధ్య ఇరుక్కుపోతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అనేది ఆసక్తికరమైన అంశం అని తెలిపారు. ఇందులో కృష్ణ అనే పాత్ర చేస్తున్నానని, తను ఎంత చిరాకు పడతాడో ఆడియన్స్ అంత ఎంటర్‌టైన్ అవుతారని ప్రదీప్ తెలిపారు.
