Skip to main content

Namaste NRI

ఫ్యామిలీ అంతా హాయిగా ఎంజాయ్‌చేసేలా ఈ సినిమా :  ప్రదీప్‌ మాచిరాజు

ప్రదీప్‌ మాచిరాజు కథానాయకుడిగా నటించిన లవ్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. దీపిక పిల్లి కథానాయిక. డుయో నితిన్‌, భరత్‌ కలిసి దర్శకత్వం వహించారు. మాంక్స్‌ అండ్‌ మంకీస్‌ పతాకంపై ఈ సినిమా తెరకెక్కింది. నేడు విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రదీప్‌ ఇటీవల విలేకరులతో ముచ్చటించారు.

ఫ్యామిలీ అంతా కూర్చొని హాయిగా ఎంజాయ్‌చేసేలా ఈ సినిమా ఉంటుందని, ఇదో అందమైన చందమామ కథ అని ఆయన చెప్పారు. కథ గురించి మాట్లాడుతూ అనగనగా ఓ ఊరు. అక్కడ ఓ అమ్మాయి. అనుకోని అతిథిగా ఆ ఊర్లోకి అడుగుపెట్టిన ఓ సివిల్‌ ఇంజనీర్‌,  ఆ ఊరి కట్టుబాట్ల మధ్య ఇరుక్కుపోతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అనేది ఆసక్తికరమైన అంశం అని తెలిపారు. ఇందులో కృష్ణ అనే పాత్ర చేస్తున్నానని, తను ఎంత చిరాకు పడతాడో ఆడియన్స్‌ అంత ఎంటర్‌టైన్‌ అవుతారని ప్రదీప్‌ తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events