బాలీవుడ్ నటుడు ఆయుష్‌శర్మ హీరోగా నటిస్తున్న చిత్రం రుస్లాన్. ఈ చిత్రానికి కరణ్.బి దర్శకుడు. కె.కె.రాధా మోహన్ నిర్మాత. జగపతిబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గ్రాండ్ మీట్‌లో ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ అతిథిగా పాల్గొని చిత్రయూనిట్‌కి శుభాకాంక్షలు అందించారు. ఈ సినిమా చాలా స్పెషల్. అన్ని పాత్రలకూ ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా ఆయుష్‌శర్మది ఎక్స్‌ట్రార్డినరీ కేరక్టర్. ఇందులో విభిన్నకోణాలున్న పాత్ర చేస్తున్నాను అని జగపతిబాబు చెప్పారు. అంకితభావం ఉన్న టీమ్‌తో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందని, మంచి సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే సినిమా ఇదని హీరో ఆయుష్‌శర్మ తెలిపారు. ఎమోషన్, యాక్షన్‌తోపాటు మంచి సంభాషణలు, అందమైన విజువల్స్ ఇలా అన్ని ఎలిమెంట్స్‌తో గొప్ప థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే సినిమా ఇదని నిర్మాత రాధామోహన్ అన్నారు. ఇంకా చిత్ర కథానాయిక సుశ్రీ మిశ్రా కూడా మాట్లాడారు. ఈ చిత్రం ఈ నెల 26న సినిమా విడుదల కానుంది.