గెటప్‌శ్రీను హీరోగా పరిచయం అవుతున్న చిత్రం రాజు యాదవ్. కృష్ణమాచారి దర్శకుడు. కె.ప్రశాంత్‌రెడ్డి, రాజేశ్ కల్లెపల్లి నిర్మాతలు. ఈ సందర్భంగా ట్రైలర్‌ని విడుదల చేశారు. తేజ సజ్జా ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరై ట్రైలర్‌ని లాంచ్ చేశారు. సినిమా మంచి విజయం సాధించాలని యూనిట్ సభ్యులందరికీ శుభాకాంక్షలు అందించారు. సినిమాకు అందరూ ప్రాణం పెట్టి పనిచేశారని, సాంకేతికంగా అన్ని విభాగాలూ అద్భుతంగా ఉంటాయని, నిర్మాతలు సినిమాను ప్రేమించి నిర్మించారని గెటప్ శ్రీను అన్నారు. ఇది జరిగిన కథ. జీవితాన్ని చూస్తున్నట్టే సినిమా ఉంటుంది. ఇందులో ఎమోషన్స్ ఆకట్టుకుంటాయి. 17న రానున్న ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచడం ఖాయం అని దర్శకుడు నమ్మకం వ్యక్తం చేశారు. ఇంకా చిత్ర యూనిట్ సభ్యులందరూ మాట్లాడారు. ఈ నెల 17న సినిమా విడుదల కానుంది. ఈ చిత్రానికి కెమెరా: సాయిరామ్ ఉదయ్, సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్, నిర్మాణం: సాయి వరుణవి క్రియేషన్స్, చరిష్మా డ్రీమ్స్ ఎంటైర్టెన్మెంట్స్.