Namaste NRI

దీంతో భవిష్యత్‌లో ఆర్థిక సంక్షోభం : మెక్రాన్‌

ప్రస్తుతమున్న వాణిజ్య అసమతుల్యతలు ప్రమాదకరం. ఇవి భవిష్యత్‌లో ఆర్థిక సంక్షోభాన్ని కూడా తీసుకురావచ్చు అని మెక్రాన్‌ అన్నారు. రెండు దేశాలూ స్వతంత్ర జియో-పొలిటికల్‌ నిర్ణయాలు తీసుకోవాలి. చైనా, ఫ్రాన్స్‌ ప్రధాన శక్తులుగా తమ స్వంత దారిలో నడవాలి అని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ తెలిపారు. బీజింగ్‌లో ఇరు దేశాధ్యక్షులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య పలు అంశాలు చర్చకు వచ్చాయి. ముఖ్యంగా మెక్రాన్‌, జిన్‌పింగ్‌కు కొన్ని అభ్యర్థనలు చేశారు. ప్రపంచ వాణిజ్యంలో పెరుగుతున్న అసమతుల్యతను తగ్గించడానికి సహరించాలనీ, రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం ఆగేలా ఒత్తిడి తీసుకురావాలనీ, పర్యావరణం, వాణిజ్యం, జియోపాలిటక్స్‌లో సహకారం కావాలని ఆయన కోరారు.కాగా మెక్రాన్‌ అధిక సంఖ్యలో వ్యాపార ప్రతినిధులతో చైనాకు వెళ్లినా నిరాశే ఎదురైంది. పెద్ద వ్యాపార ఒప్పందాలు మాత్రం జరగలేదు. ముఖ్యంగా ఫ్రాన్స్‌ ఎదురు చూస్తున్న 500 జెట్‌ ఎయిర్‌బస్‌ ఆర్డర్‌ను కూడా చైనా ప్రకటించకపోవటం గమనార్హం.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events