భారత్, నేపాల్‌ల మధ్య కొనసాగుతున్న వివాదం నేపాల్ ప్రధాని సంచలన ప్రకటనతో మరో మలుపు తిరిగింది. లిపులేఖ్, కాలాపానీ, లింపియధుర ప్రాంతాల కోసం భారత్, నేపాల్‌ల మధ్య కొనసాగుతున్న వివాదం మరో మలుపు తిరిగింది. ఈ మూడు ప్రాంతాలూ తమవేననీ, రాజకీయ, దౌత్య మార్గాల ద్వారా వాటిని భారత్ నుంచి తిరిగి పొందుతామని నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ తెలిపారు. లిఫులేఖ్, కాలాపానీ, లింపియధురలను నేపాల్ భూభాగంలో ఉన్నట్లు చూపించే కొత్త మ్యాప్‌కు ఆ దేశ కేబినెట్ ఆమోదం తెలిపింది. అనంతరం ఆయన పార్లమెంట్‌లో మాట్లాడుతూ నేపాల్‌కు చెందిన ఈ మూడు ప్రాంతాల్లోనై సైన్యాన్ని మోహరించి భారత్ వివాద్సాదంగా మర్చింది. నేపాలీలు అక్కడికి వెళ్లకుండా అడ్డుకుంది. కాలాపానీలో 1962 నుంచి భారత్ సైన్యం ఉంది. గత పాలకులు ఈ అంశాన్ని లేవనెత్తడానికి వెనుకంజ వేశారు. వాటిని మేం తిరిగి పొందుతాం అని తెలిపారు. అసలు భారత్, నేపాల్ నడుమ వివాదం గత ఏడాది అక్టోబర్‌లోనే మొదలైంది. కాలాపానీ, లిపులేఖ్‌లు తమవేనంటూ అప్పట్లో మన దేశం ఒక మ్యాప్ విడుదల చేసింది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)