Skip to main content

Namaste NRI

ఆ మూడు ప్రాంతాలు మావే… భారత్ నుంచి తిరిగి తీసుకుంటాం

భారత్‌, నేపాల్‌ల మధ్య కొనసాగుతున్న వివాదం నేపాల్‌ ప్రధాని సంచలన ప్రకటనతో మరో మలుపు తిరిగింది. లిపులేఖ్‌, కాలాపానీ, లింపియధుర ప్రాంతాల కోసం భారత్‌, నేపాల్‌ల మధ్య కొనసాగుతున్న వివాదం మరో మలుపు తిరిగింది. ఈ మూడు ప్రాంతాలూ తమవేననీ, రాజకీయ, దౌత్య మార్గాల ద్వారా వాటిని భారత్‌ నుంచి తిరిగి పొందుతామని నేపాల్‌ ప్రధాని కేపీ శర్మ ఓలీ తెలిపారు. లిఫులేఖ్‌, కాలాపానీ, లింపియధురలను నేపాల్‌ భూభాగంలో ఉన్నట్లు చూపించే కొత్త మ్యాప్‌కు ఆ దేశ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. అనంతరం ఆయన పార్లమెంట్‌లో మాట్లాడుతూ నేపాల్‌కు చెందిన ఈ మూడు ప్రాంతాల్లోనై సైన్యాన్ని మోహరించి భారత్‌ వివాద్సాదంగా మర్చింది. నేపాలీలు అక్కడికి వెళ్లకుండా అడ్డుకుంది. కాలాపానీలో 1962 నుంచి భారత్‌ సైన్యం ఉంది.  గత పాలకులు ఈ అంశాన్ని లేవనెత్తడానికి వెనుకంజ వేశారు. వాటిని మేం తిరిగి పొందుతాం అని తెలిపారు. అసలు భారత్‌, నేపాల్‌ నడుమ వివాదం గత ఏడాది అక్టోబర్‌లోనే మొదలైంది. కాలాపానీ, లిపులేఖ్‌లు తమవేనంటూ అప్పట్లో మన దేశం ఒక మ్యాప్‌ విడుదల చేసింది.

Social Share Spread Message

Latest News