Namaste NRI

థ్రిల్లింగ్ ఎంటర్ టైనర్ జిలేబి ట్రైలర్ విడుదల

శ్రీకమల్ హీరోగా,  శివాని రాజశేఖర్ కథానాయికగా నటిస్తున్న సినిమా జిలేబి.  కె. విజ‌య‌భాస్కర్ దర్శకుడు. ప్రముఖ పారిశ్రామికవేత్త గుంటూరు రామకృష్ణ ఎస్ఆర్కే ఆర్ట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అంజు అశ్రాని చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ చిత్రంలో  నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ట్రైలర్ ని విడుదల చేశారు మేకర్స్.  ట్రైలర్ అవుట్ అండ్ అవుట్ ఫన్ అండ్ థ్రిల్ రైడ్ ని అందించింది. దర్శకుడు విజయ్ భాస్కర్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో  ఫన్ ఫుల్ యూత్ ఎంటర్ టైనర్ అందించబోతున్నారని ట్రైలర్ చూస్తే అర్ధమౌతుంది. ట్రైలర్ లో శ్రీకమల్, శివాని రాజశేఖర్  పాత్రలు వినోదాత్మకంగా వున్నాయి. చివర్లో హారర్ ఎలిమెంట్స్ చాలా క్యూరియాసిటీ పెంచాయి. మణిశర్మ అందించిన నేపధ్య సంగీతం ఫన్,థ్రిల్  మరింత ఎలివేట్ చేసింది. నిర్మాణ విలువలు ఉన్నతంగా వున్నాయి. మొత్తానికి ట్రైలర్  జిలేబి హిలేరియస్ ఫన్ ఫుల్ థ్రిల్  రైడ్ అనే భరోసా ఇచ్చింది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్, పాటలకు కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఆగస్టు 18న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events