నల్గొండ- వరంగల్- ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ గెలుపొందారు. మూడు రోజులుగా సాగిన కౌంటింగ్ ప్రక్రియలో, మొదటి ప్రాధాన్యత, రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో బీజేపీ అభ్యర్థితో పాటు 43 మంది అభ్యర్థులు ఎలిమినేట్ అయ్యారు. చివరకు బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి కూడా ఎలిమినేట్ కావడంతో తీన్మార్ మలనాన్న విజయం సాధించారు.
రెండో ప్రధాన్యత ఓటులో మల్లన్నకు రాకేశ్ రెడ్డి గట్టి పోటీ ఇచ్చారు. అయితే, ముందు నుంచీ తీన్మార్ మల్లన్న ఆధిక్యం చూపించారు. బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి ఏ రౌండ్‌లోనూ పోటీ ఇవ్వలేకపోయారు. చివరకు రాకేశ్ రెడ్డి ఎలిమినేషన్ కావడంతోనే తీన్మార్ మల్లన్న గెలుపు ఖాయమైంది. ఈ మేరకు ఎన్నికల అధికారి ప్రకటన చేశారు.