Namaste NRI

న్యూయార్క్‌లో ఘనంగా టిఎల్‌సిఎ సంబరాలు

న్యూయార్క్‌లో సంక్రాంతి వేడుకలను తెలుగువారు వైభవంగా జరుపుకున్నారు. తెలుగు సారస్వత సాంస్కృతి క సంఘం (టిఎల్‌సిఎ) ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు వేలాదిమంది హాజరయ్యారు. ఎంతోమంది ప్రముఖులు తరలివచ్చి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. జనవరి 27వ తేదీన న్యూయార్క్‌ లోని ఫ్లషింగ్‌లో ఉన్న హిందూ టెంపుల్‌లో ఈ వేడుకలు అంగరంగ వైభవంగా  జరిగాయి.

 అధ్యక్షుడు కిరణ్‌ రెడ్డి పర్వతాల, వైస్‌ ప్రెసిడెంట్‌ సుమంత్‌ రామ్‌ సెట్టి, సెక్రటరీ మాధవి కోరుకొండ, ట్రెజరర్‌ శ్రీనివాస్‌ సనిగెపల్లి, జాయింట్‌ సెక్రటరీ అరుంధతి అడుప, జాయింట్‌ ట్రెజరర్‌ భగవాన్‌ నడిరపల్లి తదితరు ల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా టిటిఎ వ్యవస్థాపక నాయకుడు, పైళ్ళ మల్లారెడ్డి తోపాటు పూర్ణ అట్లూరి, కృష్ణ మద్దిపట్ల, టిఎల్‌సిఎ బోర్డ్‌ చైర్‌ పర్సన్‌ రాజి కుంచెం,రావు వోలేటి,తిపరినేని తిరుమలరావు, ముత్యాల వెంకటేష్,కృష్ణ గుజావర్తి తదితరులు హాజరయ్యారు.

 సంక్రాంతి కార్యక్రమాలతోపాటు రిపబ్లిక్‌ డే సెలబ్రేషన్స్‌ కూడా నిర్వహించారు.   ఈ వేడుకల్లో భాగంగా వివిధ సాంస్కృతిక కార్యక్ర మాలు, ముచ్చట గొలిపే నృత్యాలు, తెలుగు సినీ పాటలు, విందు భోజనం, భోగి పళ్ళు, గాలిపటాల పోటీలు అందరినీ ఆకట్టుకు న్నాయి. టాలీవుడ్‌ కొరియో గ్రాఫర్‌ రఘు మాస్టర్‌, గాయనీ గాయకులు పృథ్వీ చంద్ర, సమీర భరద్వాజ్‌, ఆర్‌.జె హేమంత్‌, మరో కొరియో గ్రాఫర్‌ మహేశ్వరి తదితరులు ఈ వేడుకల్లో హైలైట్‌గా నిలిచారు. ఈ వేడుకల్లో భాగంగా నిర్వహించిన పోటీల్లో గెలిచినవారికి మద్దిపట్ల ఫౌండేషన్‌ వారు గోల్డ్‌ కాయిన్స్‌, సిల్వర్‌ కాయిన్స్‌ అందించారు.

ఈ వేడుకలను విజయవంతం చేసిన వారందరికీ అధ్యక్షుడు కిరణ్‌ రెడ్డి పర్వతాల అభినందనలు తెలియ జేశారు. ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యులు సునీల్‌ చల్లగుల్ల, కరుణ ఇంజపూరి, దివ్య దొమ్మరాజు, లావణ్య అట్లూరి, సుధ మన్నవ, ప్రవీణ్‌ తదితరులు కూడా ఈ కార్యక్రమం విజయవంతానికి కృషి చేశారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events