టాలీవుడ్ డ్రగ్ కేసులో డైరెక్టర్ పూరీ జగన్నాథ్ విచారణ ముగిసింది. దాదాపు 10 గంటల పాటు పూరి జగన్నాథ్‌ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఈ క్రమంలో పూరి జగన్నాథ్ బ్యాంక్ లావాదేవీలపై పూర్తిగా ఆరా తీశారు. పూరీ జగన్నాథ్ హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయానికి వెళ్లారు. ఆయనతోపాటు తన చార్టెడ్ అకౌంటెంట్ శ్రీధర్‌ని కూడా ఈడీ అధికారులు పలు అంశాలపై ఆరా తీసినట్లు సమాచారం. సుదీర్ఘంగా సాగిన ఈ విచారణలో పూరీ జగన్నాథ్ పలు అంశాలను ఈడీ అధికారులకు చెప్పినట్లు తెలుస్తోంది. ఆయనకు చెందిన మూడు బ్యాంక్ ఖాతాల నుంచి సమాచారం సేకరించారు. ఉదయం 10:17 నుంచి రాత్రి 7:45 గంటల వరకు విచారణ కొనసాగింది. ఈ క్రమంలో ఈడీ పూరి జగన్నాథ్ స్టేట్‌మెంట్‌ను లిఖిత పూర్వకంగా నమోదు చేసింది. భవిష్యత్తులో విచారణకు ఎప్పుడు పిలిచినా హాజరు కావాలని అధికారులు ఆయనను ఆదేశించారు. ఈ విచారణ సెప్టెంబర్ 22 వరకు కొనసాగనుంది.