Skip to main content

Namaste NRI

టాలీవుడ్ డ్రగ్ కేసు.. పూరి జగన్నాథ్ ను ప్రశ్నించిన ఈడీ

టాలీవుడ్‌ డ్రగ్‌ కేసులో డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ విచారణ ముగిసింది. దాదాపు 10 గంటల పాటు పూరి జగన్నాథ్‌ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఈ క్రమంలో పూరి జగన్నాథ్‌ బ్యాంక్‌ లావాదేవీలపై పూర్తిగా ఆరా తీశారు. పూరీ జగన్నాథ్‌  హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయానికి వెళ్లారు. ఆయనతోపాటు తన చార్టెడ్‌ అకౌంటెంట్‌ శ్రీధర్‌ని కూడా ఈడీ అధికారులు పలు అంశాలపై ఆరా తీసినట్లు సమాచారం. సుదీర్ఘంగా సాగిన ఈ విచారణలో పూరీ జగన్నాథ్‌ పలు అంశాలను ఈడీ అధికారులకు చెప్పినట్లు తెలుస్తోంది. ఆయనకు చెందిన మూడు బ్యాంక్‌ ఖాతాల నుంచి సమాచారం సేకరించారు. ఉదయం 10:17 నుంచి రాత్రి 7:45 గంటల వరకు విచారణ కొనసాగింది. ఈ క్రమంలో ఈడీ పూరి జగన్నాథ్‌ స్టేట్‌మెంట్‌ను లిఖిత పూర్వకంగా నమోదు చేసింది. భవిష్యత్తులో విచారణకు ఎప్పుడు పిలిచినా హాజరు కావాలని అధికారులు ఆయనను ఆదేశించారు. ఈ విచారణ సెప్టెంబర్‌ 22 వరకు కొనసాగనుంది.

Social Share Spread Message

Latest News