అమెరికాలోని రెండు రాష్ర్టాల్లో టోర్నడో తుపాను బీభత్సం సృష్టించింది. పౌరహక్కుల ఉద్యమానికి కేంద్ర బిందువైన సెల్మా పట్టణానికి తీవ్ర నష్టం కలిగించింది. పెనుతుపాను తాకిడికి తొమ్మిదిమంది మృతి చెందారు. శకలాల కింద ఎవరైనా చిక్కుకుపోయారేమోనని రెస్క్యూ బృందాలు శుక్రవారం గాలింపు చేపట్టాయి. ఈ తుపాను అలబామాలోని 14 కౌంటీస్‌కు, జార్జియాలో ఐదింటికి తీవ్ర నష్టాన్ని కలిగించిందని, 12 మంది తీవ్రంగా గాయపడ్డారని, 40 ఇళ్లకు తీవ్ర నష్టం ఏర్పడిందని ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ తెలిపింది.