Skip to main content

Namaste NRI

అమెరికాలో టోర్నడో బీభత్సం

అమెరికాలోని రెండు రాష్ర్టాల్లో టోర్నడో తుపాను బీభత్సం సృష్టించింది. పౌరహక్కుల ఉద్యమానికి కేంద్ర బిందువైన సెల్మా పట్టణానికి తీవ్ర నష్టం కలిగించింది. పెనుతుపాను తాకిడికి తొమ్మిదిమంది మృతి చెందారు. శకలాల కింద ఎవరైనా చిక్కుకుపోయారేమోనని రెస్క్యూ బృందాలు శుక్రవారం గాలింపు చేపట్టాయి. ఈ తుపాను అలబామాలోని 14 కౌంటీస్‌కు, జార్జియాలో ఐదింటికి తీవ్ర నష్టాన్ని కలిగించిందని, 12 మంది తీవ్రంగా గాయపడ్డారని, 40 ఇళ్లకు తీవ్ర నష్టం ఏర్పడిందని ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ తెలిపింది.

Social Share Spread Message

Latest News