అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలోగల ఫోర్ట్ లాడర్‌డేల్ బీచ్‌లో టోర్నడో బీభత్సం సృష్టించింది. కొన్ని నిమిషాలపాటు విధ్వంసం రేపిన ఈ టోర్నడో చివరకు ఫోర్ట్ లాడర్‌డేల్ బీచ్‌లోనే సద్దుమణిగింది. ఈ టోర్నడో దాటికి పలు ఇళ్లు దెబ్బతిన్నాయి. కరెంటు స్తంభాలు కూలిపోయాయి. వైర్లు తెగిపోయాయి. నీళ్లు చేరడంతో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌లు పేలిపోయాయి. టోర్నడోలో పైకి లేచిన వ్యర్థాలు పడటంతో వీధుల నిండా చెత్త నిండిపోయింది. అయితే ఈ టోర్నడో విధ్వంసంలో స్థానికులెవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఎవరూ గాయపడలేదు. టోర్నడో వేగంగా బలం పుంజుకొని పలు భవనాలను, విద్యుత్ వైర్లను, తీరంలో నిలిచి ఉన్న నౌకలను ఢీ కొట్టిందని ఫోర్ట్ లాడర్‌డేల్ అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు.














