Namaste NRI

అమెరికాలో విషాదం.. ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి

అమెరికాలో తెలుగు విద్యార్థుల  వరుస మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. పలువురు విద్యార్థులు అనుమానాస్పద స్థితిలో మరణించడం కలచివేస్తోంది. తాజాగా ఇద్దరు విద్యార్థులు జలపాతంలో మునిగి ప్రాణాలు కోల్పోయారు.

తెలుగు విద్యార్థులు లక్కిరెడ్డి రాకేశ్‌రెడ్డి (23), రోహిత్‌ మణికంఠ రేపాల (25) అమెరికాలోని ఆరిజోనా విశ్వవిద్యాలయంలో  చదువుతున్నారు. తమ చదువు విజయవంతంగా పూర్తి చేసి ఇటీవలే ఎంఎస్‌ పట్టా కూడా పొందారు. ఈ శుభ సందర్భంగా ఈనెల 8వ తేదీన వీరు తమ స్నేహితులతో కలిసి ఆరిజోనాలోని ప్రసిద్ధ ఫాజిల్‌ క్రీక్‌ జలపాతం  వద్దకు వెళ్లారు. అక్కడ రాకేశ్‌, రోహిత్‌లు ప్రమాదవశాత్తూ జలపాతంలో మునిగిపోయా రు. గమనించిన స్నేహితులు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు జలపాతం వద్దకు చేరుకొని గాలింపు చేపట్టగా వారి ఆచూకీ లభించలేదు. మరుసటిరోజు గజ ఈతగాళ్ల సాయంతో గాలించ గా,  ఇద్దరి మృతదేహాలు లభించాయి.

తెలంగాణ నారాయణ పాఠశాలల అధినేతల్లో ఒకరైన లక్కిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, పద్మ దంపతుల ఏకైక తనయుడు రాకేశ్ రెడ్డి. కుమారుడు విశ్వవిద్యాలయం నుంచి ఎంఎస్ పట్టా తీసుకున్న సందర్భంగా తల్లిదండ్రులు కూడా అమెరికాకు వెళ్లారు. తల్లిదండ్రులు అమెరికాలో ఉండగానే కుమారుడు చనిపోవడంతో వారు శోకసంద్రంలో మునిగిపోయారు. ఇప్పుడు వారు కుమారుడి శవంతో ఇండియాకు తరలివస్తున్నారు.

Social Share Spread Message

Latest News