ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాకినాడ మున్సిపల్ కమిషనర్‌గా స్వప్నిల్ దినకర్, చిత్తూరు జాయింట్ కలెక్టర్‌గా రాజబాబు, సెర్‌ప సీఈవోగా ఇంతియాజ్ అహ్మద్‌లను నియమించింది. మైనారిటీ సంక్షేమశాఖ ప్రత్యేక కార్యదర్శిగా గంధం చంద్రుడు, శ్రీకాకుళం జాయింట్ కలెక్టర్‌గా సుమిత్ కుమార్‌లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పశ్చిమ గోదావరి జాయింట్ కలెక్టర్‌గా బి.ఆర్. అంబేడ్కర్‌ను నియమించడంతో పాటు సీసీఎల్‌ఏ అప్పీల్ డైరెక్టర్‌గా ఇంతియాజ్ అహ్మద్‌కు అదనపు బాధ్యతలు అప్పగించింది.