Namaste NRI

యూకే ప్రయాణం.. భారతీయులకు ఈ-వీసా తప్పనిసరి

యూకేలో కొత్త డిజిటల్‌ వీసా వ్యవస్థ బుధవారం నుంచి అమల్లోకి వచ్చింది. సంప్రదాయ వీసాల స్థానంలో ఈ-వీసాలను అందుబాటులోకి తెచ్చారు. యూకేకు వెళ్లే భారతీయులు ఇక మీదట ఈ-వీసా కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఇందులో ఇమిగ్రేషన్‌ స్టేటస్‌కు సంబంధించిన షేర్‌ కోడ్‌ ఉంటుంది. దీన్ని పనిచేస్తున్న కంపెనీలు, యజమానులు తదితరు లతో పంచుకునే అవకాశం కల్పించారు. ఈ కొత్త పద్ధతిలో పేపర్‌ ఆధారిత వీసా స్టిక్కర్ల స్థానంలో డిజిటల్‌ వీసాలను అమలుజేయనున్నారు. డిజిటల్‌ వ్యవస్థ అయినప్పటికీ.. బయోమెట్రిక్‌ నమోదు కోసం వీసాదారులు దరఖాస్తు కేంద్రానికి వెళ్లాల్సిందే.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events