Namaste NRI

చైనాతో డీల్ కుదిరింద‌న్న ట్రంప్‌…అమెరికాలో మ‌ళ్లీ

టిక్‌టాక్ యాప్ మ‌ళ్లీ అమెరికాలో వాడ‌నున్నారు. ఆ సోష‌ల్ మీడియా యాప్ వాడ‌కం గురించి చైనాతో డీల్ జ‌రిగిన‌ట్లు అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ వెల్ల‌డించారు. టిక్‌టాక్ యాప్‌ను ఆప‌రేష‌న‌ల్‌గా ఉంచేందుకు చైనా కంపెనీతో దాదాపు ఓ ఒప్పందం కుదిరిన‌ట్లు ఆయ‌న చెప్పారు. టిక్‌టాక్ వ్య‌వ‌హారం గురించి చైనా అధ్య‌క్షుడు జీ జిన్‌పింగ్‌తో  చ‌ర్చ‌లు జ‌ర‌పనున్న‌ట్లు ట్రంప్ తెలిపారు. దేశంలోని యువ‌త ఆ యాప్ కోసం ఆస‌క్తిగా ఉన్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. అమెరికా, ఈయూ, చైనా మ‌ధ్య జ‌రిగిన వాణిజ్య భేటీపై ఆయ‌న సంతృప్తి వ్య‌క్తం చేశారు.

చైనాకు చెందిన టెక్నాల‌జీ కంపెనీ బైట్‌డ్యాన్స్‌, టిక్‌టాక్ యాప్‌ను డెవ‌ల‌ప్ చేసింది. ఆ యాప్ చాలా వ‌ర‌కు దేశాల్లో పాపుల‌రైంది. చైనా వ్యాపార‌వేత్త జాంగ్ యిమింగ్ 2021లో బైట్‌డ్యాన్స్ కంపెనీని స్థాపించారు. దీని ప్ర‌ధాన కార్యాల‌యంలో బీజింగ్‌లోని హైదియాన్ జిల్లాలో ఉన్న‌ది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events