అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ మున్ముందుకు వెళ్తున్నకొద్దీ వాగ్బాణాలు పదునెక్కుతున్నాయి. పీఠాన్ని మరోసారి ఆశిస్తున్న అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరస్పరం సవాళ్లు విసురుకుం టూ అగ్రరాజ్య ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న ట్రంప్, తన ప్రత్యర్థి, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్‌కు తాజాగా ఓ ప్రతిపాదన చేశారు. తనతో మరో విడత చర్చించేందుకు, గోల్ఫ్ ఆడడానికి సిద్ధమా అని ఫ్లోరిడా సభలో సవాల్ విసిరారు. ప్రపంచం ముందు బైడెన్ తనను తాను నిరూపించుకునే మరో అవకాశం ఇస్తున్నట్లు తెలిపారు. చర్చలో ప్రయోక్తలు లేకుండా మనమిద్దరమే ఉందాం. ఆంక్షలు ఏమీ లేకుండా చర్చిద్దాం. ఎక్కడకు ఎప్పుడు రావాలో చెప్పండి. నేను సిద్ధం అని అన్నారు. గల్ఫ్ మ్యాచ్‌లో బైడెన్ గెలిస్తే ఆయన చెప్పిన స్వచ్ఛంధ సంస్థకు 10 లక్షల డాలర్ల విరాళం ఇస్తానని ట్రంప్ ప్రకటించారు.