అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జనవరి 20న అగ్రరాజ్యానికి 47వ అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టబో తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రపంచ దేశాధినేతలు హాజరుకానున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఆహ్వానాలు కూడా పంపుతున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ కు కూడా ఆహ్వానం పంపినట్లు తెలిసింది. ట్రంప్ అధ్యక్ష బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి రావాల్సిందిగా జిన్‌పింగ్‌ను ఆహ్వానించినట్లు సమాచారం.