Namaste NRI

టీటీఏ మెగా కన్వెన్షన్‌.. కిక్‌ ఆఫ్‌ ఈవెంట్స్‌ విజయవంతం

తెలంగాణ అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ (టీటీఏ) మెగా కన్వెన్షన్‌ కోసం నిధుల సేకరణలో భాగంగా నిర్వహిస్తున్న కిక్‌  ఆఫ్‌ ఈవెంట్స్‌ విజయవంతంగా సాగింది.  అధ్యక్షులు వంశీ రెడ్డి కంచరకుంట్ల, కన్వీనర్‌ చంద్రసేన శ్రీరామోజు ఆధ్వర్యంలో అమెరికాలోని మేజర్‌ సిటీలో స్థానిక టీటీఏ  నిర్వహణలో ఈ కిక్‌ ఆఫ్‌ ఈవెంట్స్‌ నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 24న సాయంత్రం అట్లాంటా లో అడ్వైజరీ కౌన్సిల్‌ సభ్యులు భరత్‌ రెడ్డి మాదాడి సారధ్యంలో నిర్వహించిన కిక్‌ ఆఫ్‌ నిధుల సేకరణ కార్యక్రమం ఊపు తెచ్చింది అని తెలిపారు. అందరి అంచనాలకు మించి 3,20,00 డాలర్ల విరళాలు సేకరించారు.  దాతలలో ముఖ్యంగా అడ్వైజరీ కౌన్సిల్‌ సభ్యులు భరత్‌ రెడ్డి మాదాడి రూ.100,000 మరియు ప్రముఖ అట్లాంటా నేత గౌతమ్‌ గోలి రూ.50,000 లతో మార్గదర్శకంగా నిలిచారు. ఈ కార్యక్రమానికి చార్లెట్‌ నుంచి ప్రెసిడెంట్‌ ఎలెక్ట్‌  నవీన్‌ రెడ్డి మల్లి పెద్ది కూడా  హాజరవ్వడం అభినందనీయం.

టీటీఏ నాయకులకు ఘనంగా స్వాగతం పలకగా, అందరూ సోషలైజ్‌ అయిన తర్వాత జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంతో ప్రారంభించారు. టీటీఏ నాయకులు ఆహ్వానితులను ఉద్దేశించి ప్రసంగించారు. సియాటిల్‌ లో మొదటిసారి నిర్వహిస్తున్న టీటీఏ మెగా  మెగా కన్వెన్షన్‌ కి అందరినీ సభాముఖంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు వంశీ రెడ్డి కంచరకుంట్ల లాంటి చక్కని ప్లాట్‌ ఫామ్‌ ని ఏర్పాటు చేసిన వ్యవస్థాప కులు డా. పైళ్ల మల్లారెడ్డి, అడ్వైజరీ కౌన్సిల్‌ ఛైర్‌ డా. విజయపాల్‌ రెడ్డి, కో చైర్‌ డా. మోహన్‌ రెడ్డి పటలోళ్ళ, సభ్యులు భరత్‌ రెడ్డి మాదాడి లను కొనియాడారు.

అనంతరం పలువురు తమ డొనేషన్స్‌ ప్రకటించారు. ఈ కార్యక్రమానికి టీఏటీఏ ఏటీఏ,  ఎన్‌ఏటీఏ, జీటీఏ, టీడీఫ్‌ వంటి జాతీయ తెలుగు సంఘాల నేతలు, టీఏఎమ్‌ఏ, జీఏటీఏ, జీఏటీఎస్‌ స్థానిక తెలుగు సంఘాల నేతలు హాజరయ్యి మద్దతు తెలపడం విశేషం.  ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున విజయవంతం అవ్వడానికి నేతలు, సభ్యులు స్వాతి చెన్నూరి, వెంకట్‌ గడ్డం, కార్తీక్‌ నిమ్మల, సుధీర్‌ రెడ్డి కొత్త, త్రిలోక్‌ గుంటుక, ప్రభాకర్‌ మధుపతి, గిరి కోటగిరి, జ్యోత్స్న పాలకుర్తి, వాణి గడ్డం, దీప్తి ఎలుగూరి, దీపికా రెడ్డి నల్లా, శ్వేత నిమ్మల, శైలజ, సుప్రజ, నిధీశ్‌, మధు, కిరణ్‌, శ్రీపాల్‌, శశంక్‌, మాధవ్‌, అశోక్‌ తదితరులు ముఖ్య కారణం.  జనార్దన్‌ పన్నెల, రాగవాహిని తమ పాటలతో జ్యోత్స్న పాలకుర్తి తన వ్యాఖ్యానంతో డీజే పాటలతో రజనీకాంత్‌ అందరినీ అలరించారు. ఈ కిక్‌ ఆఫ్‌ ఈవెంట్‌ విజయవంతం అయిన సందర్భంగా కేక్‌ కట్‌ చేశారు. బిర్యాటీ పాట్‌ అనీల్‌ అందించిన డిన్నరర్‌ అనంతరం వందన సమర్పణతో అట్లాంటా కిక్‌ ఆఫ్‌ ఈవెంట్‌ ముగిసింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events