అజయ్ భూపతి దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం మంగళవారం. ఈ సినిమాలో పాయల్ రాజ్పుత్ లీడ్ రోల్ పోషిస్తుంది. రీసెంట్గా ఈ మంగళవారం నుంచి ఫస్ట్ లుక్తో పాటు టీజర్ విడుదల కాగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. అజయ్ భూపతి మాట్లాడుతూ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కించిన రస్టిక్ యాక్షన్ థ్రిల్లర్ మంగళవారం. సినిమాలో ఉన్న ప్రతి క్యారెక్టర్ చాలా కొత్తగా ఉంటుంది. ఎవరు మంచి? ఎవరు చెడు? అనేది కనిపెట్టలేని విధంగా కథనం ముందుకు వెళుతుంది. క్యారెక్టర్స్ మీద బేస్ చేసుకుని తీసిన సినిమా. పాయల్ రాజ్పుత్ క్యారెక్టర్ చూస్తే షాక్ అవుతారు. థియేటర్లలో ప్రేక్షకులకు డిఫరెంట్ థ్రిల్ అందించే సినిమా ఇది అని అన్నారు. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ విడుదల తేదీని ప్రకటించారు. ఈ సినిమాను నవంబర్ 17న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ తెలిపారు.
