Namaste NRI

యూఏఈ గోల్డెన్‌ వీసా…ఎవరెవరికి ఛాన్స్ ఉందంటే!

నర్సులకు పదేళ్ల గోల్డెన్‌ వీసా ఇవ్వనున్నట్లు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) ఈ నెల 12న ప్రకటించింది. దుబాయ్‌ హెల్త్‌ శాఖలో 15 సంవత్సరాలకుపైగా పని చేసిన అనుభవం కలవారికి ఈ వీసాను ఇస్తామని తెలిపింది. ఎంపిక చేసిన విదేశీయులకు 10 ఏళ్ల రెసిడెన్సీని ఇచ్చే గోల్డెన్‌ వీసా పథకాన్ని 2019లో ప్రారంభించారు.

విద్య, వైద్య రంగాల్లో క్వాలిఫైడ్‌ ప్రొఫెషనల్స్‌,  పెట్టుబడిదారులు, ఔత్సాహిక పారిశ్రమికవేత్తలు; సాంకేతిక పరిజ్ఞానం, సృజనాత్మక పరిశ్రమలు, గేమింగ్‌ వంటి రంగాల్లో పని చేసే నైపుణ్యంగల కార్మికులు ఈ వీసాను పొందవచ్చు. పదేళ్ల గోల్డెన్‌ వీసా పథకాన్ని టీచర్లు, విద్యావేత్తలకు కూడా వర్తింపజేస్తామని విజ్ఞానం, మానవాభివృద్ధి సంస్థ ప్రకటించింది. దుబాయ్‌లోని ప్రైవేట్‌ ఎడ్యుకేషన్‌ ప్రొఫెషనల్స్‌కు ఇది వర్తిస్తుందని తెలిపింది. శిశు సంరక్షణ కేంద్రాలు, పాఠశాల లు, విశ్వవిద్యాలయాలలో పని చేస్తూ, అద్భుతమైన పనితీరు కనబరచిన, విద్యా ప్రమాణాలను పెంచినవారికి గోల్డెన్‌ వీసా ఇస్తామని చెప్పింది.

Social Share Spread Message

Latest News