Namaste NRI

ఉత్తర అమెరికా తెలుగు సంఘం(TANA) ఆధ్వర్యంలో 1000 మంది రైతులకు 25 లక్షల విలువ గల పవర్ స్ప్రేయర్లు,తార్పాలిన్ల పంపిణీ

పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణంలోని వీ.కే. ఫంక్షన్ హాల్‌లో తానా ఆధ్వర్యంలో “రైతు కోసం” కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సుమారు 1000 మంది రైతులకు 25 లక్షల విలువ గల పవర్ స్ప్రేయర్లు మరియు తార్పాలిన్లు పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమం తానా ట్రెజరర్ రాజా కసుకుర్తి మార్గదర్శకత్వంలో, తానా అధ్యక్షుడు డా. నరేన్ కొడాలి మరియు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ లావు అభినందనలతో నిర్వహించబడింది.

ఈ కార్యక్రమానికి అప్కాబ్ (APCOB) చైర్మన్ గన్ని వీరాంజనేయులు మరియు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారు రైతులకు అవసరమైన వ్యవసాయ పరికరాలను అందిస్తూ తానా చేపడుతున్న సేవా కార్యక్రమాలను అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడిన అతిథులు రైతులకు అవసరమైన పరికరాలు అందించడం ద్వారా రైతులకు మద్దతుగా నిలుస్తున్న తానా సేవలు ఎంతో అభినందనీయమని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా తానా ట్రెజరర్ రాజా కసుకుర్తి మాట్లాడుతూ రైతులు దేశానికి అన్నదాతలు అని పేర్కొన్నారు.“మన దేశానికి రైతు అన్నదాత. రైతు కష్టపడితేనే మనకు అన్నం దొరుకుతుంది. రైతులు అనేక కష్టాలు ఎదుర్కొంటున్న ఈ పరిస్థితుల్లో వారికి కొంతైనా సహాయం చేయాలనే ఉద్దేశంతో తానా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. రైతులకు అందిస్తున్న పవర్ స్ప్రేయర్లు మరియు తార్పాలిన్లు వారి వ్యవసాయ పనులను సులభతరం చేస్తాయని ఆశిస్తున్నాం.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలను ఒకటిగా చేర్చి సమాజానికి తిరిగి ఇవ్వడం తానా లక్ష్యం. విద్య, ఆరోగ్యం, రైతుల సంక్షేమం వంటి అనేక రంగాల్లో తానా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తోంది. రైతులు బలంగా ఉంటే దేశం బలంగా ఉంటుంది. ఈ కార్యక్రమంలో తణుకు ప్రాంతానికి చెందిన పలువురు స్థానిక నాయకులు, రైతు సంఘాల ప్రతినిధులు, గ్రామాల రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events