Namaste NRI

బీఆర్ఎస్ సౌతాఫ్రికా శాఖ ఆధ్వ‌ర్యంలో… వింటర్ బ్లాంకెట్ డ్రైవ్

బీఆర్‌ఎస్ పార్టీ తరపున సౌత్ ఆఫ్రికాలోని వివిధ ప్రాంతాలలో బీఆర్ఎస్ సౌతాఫ్రికా శాఖ ఆధ్వ‌ర్యంలో పేద‌ల‌కు దుప్పట్లు పంపిణి చేశారు. పోలీస్ స్టేష‌న్ స‌మీపంలో విక్టిమ్ ఎంప‌వ‌ర్‌మెంట్ సెంట‌ర్‌లో సౌత్ ఆఫ్రికా బీఆర్‌ఎస్‌ శాఖ అధ్యక్షుడు గుర్రాల నాగరాజు ఆధ్వ‌ర్యంలో కార్యవర్గ సభ్యులతో కలిసి దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా గుర్రాల నాగ‌రాజు మాట్లాడుతూ పేదలకు ప్రతి సంవత్సరం శీతాకాలంలో దుప్పట్ల పంపిణీ జరుగుతుందని అన్నారు.  

సౌత్ ఆఫ్రికా పోలీస్ సభ్యులు సార్జంట్ ఎంపుట్ల మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ శాఖ గత ఆరేండ్లు ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తున్నార‌ని, అందుకు ఆ శాఖ సభ్యులను అభినందిస్తున్నాం అని అన్నారు. దీనివ‌ల్ల రోడ్ల‌పై జీవిస్తున్న వారికి సహాయం అందుతుందని అన్నారు.  ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ ద‌క్షిణాఫ్రికా శాఖ‌ కమిటీ సభ్యులు హరీష్ రంగ, ఉమా మేహేశ్వర్, అరవింద్ చీకోటి, సౌజన్ రావు, శివారెడ్డి, సాయి వేముల  పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events