ఎన్నారై వాసవీ అసోసియేషన్ ఇప్పుడు 7వ గ్లోబల్ మహాసభలకు సిద్ధమైంది. సెయింట్ లూయిస్ లోని అమెరికా సెంటర్ లో జూలై 4,5,6 తేదీల్లో అంగరంగ వైభవంగా మహాసభలు ప్రారంభమయ్యాయి. ప్రెసిడెంట్ శ్రీనివాసరావు పందిరి ఆధ్వర్యంలో కన్వీనర్ ఎల్‌ఎన్ రావు చిలకల, కో కన్వీనర్ వంశీ గుంటూరు, కన్వెన్షన్ సెక్రటరీ ఫణిశ కోడూరు, కన్వెన్షన్ ట్రజరర్ శేఖర్ పేర్లతోపాటు ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు రమేష్ బాపనపల్లి (ప్రెసిడెంట్ ఎలక్ట్), ప్రవీణ్ తడకమళ్ళ (జనరల్ సెక్రటరీ), గంగాధర్ ఉప్పల (ట్రెజరర్), బోర్డ్ ట్రస్టీలు, కన్వెన్షన్ టీమ్‌లు ఈ మూడురోజులపాటు జరిగే ఈ కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు నిర్విరామంగా కృషి చేస్తున్నాయి.
ఇళయరాజా సంగీత విభావరిలో ప్రముఖ నేపథ్య గాయనీ గాయకులు పాటలను పాడనున్నారు. ఎస్.పి. చరణ్, విభావరి జోషి ఆప్టే, శ్వేత మోహన్ తదితరులు పాటలు పాడనున్నారు. కార్తిక్ బి కొడకండ్ల, లయ, నేహా శెట్టి, మిమిక్రీ జితేంద్ర, వెంకీ మంకీ, వర్షిణి, యాంకర్ సమీర, రోబో గణేష్ తదితరులు ఈ మహాసభలకు వస్తున్నారు.
ఈ మహాసభల్లో ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా సంగీత విభావరి హైలైట్‌గా నిలుస్తోంది. అలాగే ప్రముఖ ఆధ్యాత్మిక గురువు రవిశంకర్ మెడిటేషన్ కార్యక్రమం, తీయరీ బాండ్ వారి సంగీత కార్యక్రమం, శ్రీ శివపార్వతుల కళ్యాణోత్సవం వంటి కార్యక్రమాలతోపాటు అందరికీ ఉపయోగపడేలా ఎన్నో కార్యక్రమాలను, సెమినార్‌లు, పోటీలు, అవార్డులు, సన్మానాలు వంటివి ఈ మహాసభల్లో ఏర్పాటు చేశారు.
బాంక్వెట్ కార్యక్రమాలు, మ్యాజిక్ షో, కార్నివాల్ గేమ్స్, డిజె, ఐస్ బ్రేకర్ సెషన్, హిప్నాటిస్ట్ షో, టిక్ టాక్ కాంపిటీషన్, జెన్ ఎఐ క్రియేటర్ ఫైనల్స్, ఆర్ట్ ప్రాజెక్ట్, మీట్ అండ్ గ్రీట్, స్పెల్లింగ్ బి ఛాంపియన్, రోబో గణేశ్ వర్క్ షాప్ ఇలా ఎన్నో కార్యక్రమాలను ఈ మూడురోజుల వేడుకల్లో ఏర్పాటు చేశారు. రియల్ ఎస్టేట్‌పై ప్యానల్ డిస్కషన్స్, ఎఐ ప్యానెల్ డిస్కషన్, స్టాక్స్ అండ్ ఫైనాన్షియల్ లిటరసీ, బిల్డింగ్ అండ్ స్కేలింగ్ సక్సెస్ పుల్ స్టార్టప్స్ వంటి కార్యక్రమాలు కూడా ఇందులో ఏర్పాటు చేశారు.