సౌత్ ఆఫ్రికాలో నివాసముంటున్న తెలంగాణ ప్రజలు తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా కార్యవర్గం గా ఏర్పడి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మిడ్‌రాండ్ లోని టుమెలో హోం అనే దివ్యాంగ బాలల అనాథ శరణాలయాన్ని సందర్శించారు. వారికి మూడు నెలలపాటు కావలిసిన నిత్యా వసర సరుకులను అందజేశారు. తమ కార్యవర్గం ఏర్పడిన తొమ్మిదేండ్ల నుంచి సంవత్సరంలో మూడు సార్లు దాతృత్వ కార్యక్రమాలను చేపడుతున్నామని టాసా సభ్యులు కొప్పుల ప్రవీణ్, వడిచర్ల సంతోష్ తెలిపారు. కుటుంబ పోషణతో పాటు సమాజానికి మేలు చేయాలనే సంకల్పంతో ఇతర దేశాల్లో నివసిస్తున్న తెలుగు ప్రజలు తమ వంతుగా దాతృత్వ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ అనాథులకు అండగా నిలుస్తున్నారు.