తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) ఆధ్వర్యంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా గీతం డీమ్డ్ వర్సిటీ వేదికగా దివ్యాంగుల క్రికెట్ పోటీలను నిర్వహించనున్నారు. ఈ నెల 9వ తేదీ నుంచి 13 వ తేదీ వరకు జరగనున్న దివ్యాంగుల క్రికెట్ పోటీల పోస్టర్‌ను గీతం అధ్యక్షుడు ఎం. శ్రీభరత్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగుల్లో క్రీడా స్ఫూర్తిని నింపడానికి ఈ పోటీలు ఉపకరిస్తాయని అన్నారు. తానా ఫౌండేషన్ క్రీడా విభాగం కో ఆర్డినేటర్ యార్లగడ్డ శశాంక్ మాట్లాడుతూ దివ్యాంగుల కోసం వీల్ చైర్ సౌత్ ఇండియా ఈ క్రికెట్ కప్ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ వీల్ చైర్ అండ్ డిజెబిలిటీ క్రికెట్ అసోసియేన్ అధ్యక్షుడు శ్యామూల్ బెంజిమన్ మాట్లాడుతూ ఈ పోటీలకు దక్షిణ భారత దేశం నుంచి 100కి పైగా విద్యాంగ క్రికెట్లు హాజరవుతున్నారన్నారు. తొలిసారిగా విశాఖలో ఈ క్రీడలు నిర్వహిస్తున్నామన్నారు. తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి, వ్యవస్థాపక చైర్మన్ యార్లగడ్డ వెంకటరమణ, ట్రస్టీ సామినేని రవి తదితరులు గీతం యాజమాన్యాన్ని అభినందించారు. గీతం క్రీడా విభాగం డైరెక్టర్ అరుణ్‌కార్తిక్ తదితరులు పాల్గొన్నారు.