Skip to main content

Namaste NRI

తానా ఆధ్వర్యంలో గీతంలో దివ్యాంగుల క్రికెట్‌ పోటీలు

తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా (తానా) ఆధ్వర్యంలో  అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా గీతం డీమ్డ్‌ వర్సిటీ వేదికగా  దివ్యాంగుల క్రికెట్‌ పోటీలను నిర్వహించనున్నారు.  ఈ నెల 9వ తేదీ నుంచి 13 వ తేదీ వరకు జరగనున్న దివ్యాంగుల క్రికెట్‌ పోటీల పోస్టర్‌ను గీతం అధ్యక్షుడు ఎం. శ్రీభరత్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగుల్లో క్రీడా స్ఫూర్తిని నింపడానికి ఈ పోటీలు ఉపకరిస్తాయని  అన్నారు.  తానా ఫౌండేషన్‌ క్రీడా విభాగం కో ఆర్డినేటర్‌ యార్లగడ్డ శశాంక్‌ మాట్లాడుతూ  దివ్యాంగుల కోసం వీల్‌ చైర్‌ సౌత్‌ ఇండియా ఈ క్రికెట్‌ కప్‌ పోటీలు నిర్వహిస్తున్నట్లు  తెలిపారు.  ఆంధ్రప్రదేశ్‌ వీల్‌ చైర్‌ అండ్‌ డిజెబిలిటీ క్రికెట్‌ అసోసియేన్‌ అధ్యక్షుడు శ్యామూల్‌ బెంజిమన్‌ మాట్లాడుతూ ఈ పోటీలకు దక్షిణ భారత దేశం నుంచి 100కి పైగా విద్యాంగ క్రికెట్లు హాజరవుతున్నారన్నారు. తొలిసారిగా విశాఖలో ఈ క్రీడలు నిర్వహిస్తున్నామన్నారు.  తానా అధ్యక్షుడు  లావు అంజయ్య చౌదరి, వ్యవస్థాపక చైర్మన్‌ యార్లగడ్డ వెంకటరమణ, ట్రస్టీ సామినేని రవి తదితరులు గీతం యాజమాన్యాన్ని అభినందించారు. గీతం క్రీడా విభాగం డైరెక్టర్‌ అరుణ్‌కార్తిక్‌ తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News