ఢిల్లీ వేదికగా జరగనున్న జీ20 సదస్సుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పలు దేశాధినేతలు ఇప్పటికే హస్తిన చేరుకోగా, వీఐపీలు, ప్రముఖులు సదస్సులో పాల్గొనేందుకు ఢిల్లీ బాటపట్టారు. జీ20 సదస్సులో పాల్గొనేందుకు ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఢిల్లీ చేరుకున్నారు. సెప్టెంబర్ 9-10న భారత్ మండపంలో జరిగే ఈ ప్రతిష్టాత్మక సదస్సుకు హాజరయ్యేందుకు ఢిల్లీలో అడుగుపెట్టిన గుటెరస్‌కు నృత్య కళాకారిణులు జానపద నృత్యం చేస్తుండగా ఘన స్వాగతం లభించింది. సదస్సు ముగిసే క్రమంలో జీ20 ఢిల్లీ డిక్లరేషన్‌ను ప్రకటించనున్నారు.
