Skip to main content

Namaste NRI

ఐక్య‌రాజ్య‌స‌మితి సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్ ఆంటోనియో గుటెర‌స్ కు  ఘ‌న స్వాగ‌తం

ఢిల్లీ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న జీ20 స‌ద‌స్సుకు ఏర్పాట్లు పూర్త‌య్యాయి. ప‌లు దేశాధినేత‌లు ఇప్ప‌టికే హ‌స్తిన చేరుకోగా, వీఐపీలు, ప్ర‌ముఖులు స‌ద‌స్సులో పాల్గొనేందుకు ఢిల్లీ బాటప‌ట్టారు. జీ20 స‌ద‌స్సులో పాల్గొనేందుకు ఐక్య‌రాజ్య‌స‌మితి సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్ ఆంటోనియో గుటెర‌స్  ఢిల్లీ చేరుకున్నారు. సెప్టెంబ‌ర్ 9-10న భార‌త్ మండ‌పంలో జరిగే ఈ ప్ర‌తిష్టాత్మ‌క స‌ద‌స్సుకు హాజ‌ర‌య్యేందుకు ఢిల్లీలో అడుగుపెట్టిన గుటెర‌స్‌కు నృత్య కళాకారిణులు జాన‌ప‌ద నృత్యం చేస్తుండ‌గా ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. స‌ద‌స్సు ముగిసే క్ర‌మంలో జీ20 ఢిల్లీ డిక్ల‌రేష‌న్‌ను ప్ర‌క‌టించ‌నున్నారు.

Social Share Spread Message

Latest News